కాగజ్‌నగర్‌టౌన్: ఎస్పీఎంలో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని మంగళవారం నిరుద్యోగ జేఏసీ నాయకులు పట్టణంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలో ర్యాలీని ప్రారంభిస్తుండగా.. పోలీసులు అడ్డుకుని జేఏసీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎస్పీఎం కంపెనీ ఉద్యోగ కల్పన పొరాట సంఘం కన్వీనర్ పొన్న రమేశ్ మాట్లాడారు. ఈ నెల 16న ర్యాలీ అనుమతుల కోసం మీ సేవలో చలాన్ కట్టామని, డీఎస్పీకి సైతం లేఖ ఇచ్చామని తెలిపా రు. పోలీసులు అత్యుత్సాహంతో ర్యాలీ అడ్డుకున్నారని ఆరోపించారు. మిల్లు యాజమాన్యానికి పోలీ సులు తొత్తుగా మారారని విమర్శించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, సీపీఎం నాయకులు ముంజం ఆనంద్ కుమార్, బీఆర్‌ఎస్ ట్రేడ్ యూనియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు అంబాల ఓదెలు తదితరులు జేఏసీ నాయకులను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ మిల్లులో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించకపోవడం అన్యాయమని అన్నారు. స్కిల్డ్ జాబ్స్ 80 శాతం స్థానికులకు ఇవ్వాలని, అన్‌స్కిల్డ్ విభాగంలో 70 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధనలను తుంగలో తొక్కి స్థానికేతరులకు ఉద్యోగాలు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.