
ఏజెన్సీ బంద్‌కు సీపీఎం మద్దతు
కాగజ్‌నగర్ టౌన్: ఆదివాసీలకు ఉరితాడుగా మారి న జీవో 49ని రద్దు చేయాలని ఈనెల 21న ఆదివా సీ సంఘాలు తలపెట్టిన ఏజెన్సీ బంద్‌కు సీపీఎం జి ల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ జి ల్లా కార్యదర్శి కూశన రాజన్న తెలిపారు. శనివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ని అమలు చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కన్జర్వేషన్ కారిడార్ పేరిట జిల్లాలోని 339 గ్రామాల ఆదివాసీ ప్రజలు తమ గ్రామాలు, భూ ములకు దూరమయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. రా జ్యాంగంలోని 5వ షెడ్యూల్, 1/70 పెసా చట్టాన్ని ఉల్లంఘిస్తూ 49 జీవోను తెరపైకి తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీలను తరలించి అడవి ని, అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగా టైగర్ జోన్ కారిడార్ ఏర్పాటు కు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. జీవో 49 రద్దుకు తలపెట్టిన ఏజెన్సీ బంద్‌కు జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మద్దతు తె లిపి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముంజం ఆనంద్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.సాయికృష్ణ, వీ సాయికృష్ణ, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.