
● ఆర్గానిక్ పంటలకు మార్కెట్‌లో డిమాండ్ ● జిల్లాలో ఎన్
ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకంతో ప్రోత్సాహం
రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వినియోగంతో పెట్టుబడులు పెరగడంతో జిల్లా రైతాంగం సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపుతోంది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్ర భుత్వం అమలు చేస్తున్న ఎన్‌ఎంఎన్‌ఎఫ్ (నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్) పథకం వీరికి వ రంగా మారింది. రసాయన ఎరువుల వినియోగంతో సాగుభూములు నిర్జీవంగా మారుతున్నాయి. ప్రకృతికి, మానవాళికి తీవ్ర విఘాతం జరుగుతోంది. దీంతో రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
జిల్లాలో 24 క్లస్టర్ల గుర్తింపు
జిల్లాలో 15 మండలాల్లో 24 క్లస్టర్లను అధికారులు ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకానికి ఎంపిక చేశారు. ఒక్కో క్లస్టర్ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నుంచి 125 మంది రైతులను ఎంపిక చేసి ఒక్కొక్కరు ఒక్కో ఎకరంలో సేంద్రియ విధానంలో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 3వేల మంది రైతుల కు చెందిన 3వేల ఎకరాల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేస్తున్నారు. ఏ పంట ఏ భూమికి అనుకూలమో వివరించనున్నారు. మొద టి విడతలో పంటకు సరిపడా వేప పిండి, నూనె ఉచితంగా అందిస్తారు. సేంద్రియ విధానంలో పండించిన పంటలకు మార్కెట్‌లో ఉండే డిమాండ్‌ను వివరించి రైతులను చైతన్య పరుస్తున్నారు. అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో సేంద్రియ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను ప్రోత్సహిస్తున్నారు.
జిల్లాలో ఎంపికై న గ్రామాలివే..
మండలం గ్రామాలు
ఆసిఫాబాద్ వావుదం, మొవాడ్ వావుదం
కాగజ్‌నగర్ మాలిని
దహెగాం చిన్నరాస్పల్లి
తిర్యాణి గిన్నెధరి, మాణిక్యాపూర్
వాంకిడి సోనాపూర్, సోనాపూర్ సవాతి
రెబ్బెన తక్కలపల్లి
కౌటాల గుండాయిపేట్
పెంచికల్‌పేట్ కమ్మర్‌గాం, నందిగాం, కమ్మర్‌గాం
బెజ్జూర్ కుకుడ, సోమిని
చింతలమానెపల్లి చింతలమానెపల్లి
జైనూర్ జైనూర్
సిర్పూర్(యూ) పంగిడి, సిర్పూర్(యూ)
కెరమెరి కరంజివాడ, కెరమెరి, సుర్దాపూర్, సాంగ్వీ
లింగాపూర్ లింగాపూర్
రసాయనాలను తగ్గించడమే లక్ష్యం
రసాయన ఎరువులు వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకాన్ని అమలులోకి తెచ్చింది. సేంద్రియ విధానంలో సాగు చేసిన పంటలకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది. జిల్లాలో ఎంపికై న గ్రామాల్లో రైతుల భూముల నుంచి మట్టి నమూనాలు సేకరిస్తున్నాం. భూమి స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేసేలా వారికి అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ సంస్థ వారు పథకం అమలు తీరును పరిశీలిస్తున్నారు. సేంద్రియ సాగుకు ఎంపికైన రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. భవిష్యత్‌లో జిల్లాలో సేంద్రియ సాగు మరింత పెరిగే అవకాశముంది.
– శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి

● ఆర్గానిక్ పంటలకు మార్కెట్‌లో డిమాండ్ ● జిల్లాలో ఎన్