
కోడిగుడ్ల సరఫరాకు దరఖాస్తుల స్వీకరణ
ఆసిఫాబాద్: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్సియల్ పాఠశాలల కు అగ్‌మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఈ నెల 21నుంచి టెండర్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లోగల తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆన్‌లైన్ టెండర్ల స్వీకరణపై అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26 విద్యాసంవత్సరానికి 2,06,33,123 కోడిగుడ్లు సరఫరా చేసేందుకు ఆన్‌లైన్ ద్వారా టెండర్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21నుంచి ఆగస్టు 5సా యంత్రం 5గంటల వరకు బిడ్ డాక్యుమెంట్లను డౌ న్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్‌లో అందజేయాలని సూ చించారు. బిడ్ హార్డ్ కాపీలను ఆగస్టు 6 సాయంత్రం 5గంటల లోపు కలెక్టరేట్‌లోని ఎస్సీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని తె లిపారు. ఆగస్టు 7న ఉదయం 11.30గంటలకు ధర ల బిడ్ తెరవనున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు ని బంధనల ప్రకారం అవసరమయ్యే ధ్రువపత్రాలను టెండర్లతో జతపరచాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, ఎస్సీ సంక్షేమాధికారి సజీవన్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.