కొనసాగుతున్న శరన్నవ రాత్రి ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న శరన్నవ రాత్రి ఉత్సవాలు

Oct 16 2026 12:36 AM | Updated on Oct 16 2026 12:36 AM

లలితా పరమేశ్వరీదేవిగా అమ్మవారి దర్శనం

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈమేరకు ఐదో రోజైన గురువారం అర్చకులు తెల్లవారుజామునే శ్రీవారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత యాగశాలలోని శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల వద్ద హోమం నిర్వహించగా, శ్రీలలితా సహస్ర పారాయణం చేశారు. అనంతరం అలివేలు మంగ అమ్మవారిని శ్రీ లలితా పరమేశ్వరీదేవిగా అలంకరించారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

పారామెడికల్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి

దరఖాస్తులు

ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో వివిధ పారామెడికల్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి.శంకర్‌ తెలిపారు. డిప్లొమా ఇన్‌ అనస్తేషియా టెక్నీషియన్‌, డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నీషియన్‌లో సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యత బైపీసీ విద్యార్థులకు ఇవ్వనుండగా, ఆ తర్వాత ఎంపీసీ, ఇతర అర్హులైన అభ్యర్థులకు కేటాయిస్తామని తెలిపారు. https//tgpmb. telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ కాపీకి అవసరమైన ధ్రువపత్రాలు జత చేసి మెడికల్‌ కాలేజీలో ఈనెల 24వ తేదీలోగా అందజేయాలని సూచించారు.

ఆర్టీసీలో ముగిసిన పోస్టల్‌ బ్యాలెట్‌

ఈనెల 17న అధికారికంగా ఫలితాలు వెల్లడి

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ముగిసింది. ఈనెల 9న సాధారణ పోలింగ్‌ నిర్వహించగా, ఆరోజు విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు బుధ, గురువారం రీజియన్‌లోని 45 మందికి గాను 44 మంది ఖమ్మం కలెక్టరేట్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర గుర్తింపునకు సంబంధించి ఎంప్లాయీస్‌ యూనియన్‌ కు 27 మంది, టీడబ్ల్యూయూకు 15 మంది ఓటు వేశారు. ఇంకో ఇద్దరి ఓట్లు చెల్లలేదు. ఖమ్మం రీజియన్‌ స్థాయి గుర్తింపునకు ఎన్‌ఎంయూకు 15 మంది, ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు 23 మందితో పాటు ఎస్‌డబ్ల్యూయూ, టీజేఎంఎయూ, బీకేయూకు ఒకొక్కరు ఓటు వేయగా.. ఇంకో మూడు ఓట్లు చెల్లలేదు. రాష్ట్ర స్థాయి గుర్తింపు కోసం ఎంప్లాయీస్‌ యూనియన్‌కు ఓటు వేసిన కార్మికులు, రీజియన్‌ స్థాయిలో మాత్రం ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు ఓట్లు వేయడం గమనార్హం. సాధారణ పోలింగ్‌ రోజు నమోదైన ఓట్లకు వీటిని కలిపి 17వ తేదీన అధికారిక ఫలితాలు వెల్లడించనున్నారు.

కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

ఖమ్మం క్రైం: విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు ఉద్యోగులు కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ సూచించారు. డాక్టర్‌ అగర్వాల్స్‌ కంటి ఆస్పత్రి సౌజన్యంతో హెడ్‌ క్వార్టర్స్‌లో గురువారం ఏర్పాటుచేసిన ఉచిత వైద్య సీపీ ప్రారంభించి మాట్లాడారు. చూపు సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన చికిత్స తీసుకుంటే ఇబ్బంది ఉండదని తెలిపారు. అనంతరం ఉద్యోగులకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పరీక్షలు నిర్వహించి, అవసరమైన సలహాలు ఇచ్చారు. డాక్టర్‌ పాశం మహేష్‌, అడిషనల్‌ డీసీపీలు రామానుజం, కుమారస్వామి, ఏసీపీలు నర్సయ్య, సుశీల్‌ సింగ్‌, డాక్టర్‌ పాశం మహేష్‌, ఆర్‌ఐలు కామరాజు, సురేష్‌, శ్రీశైలం, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement