ఖమ్మం సహకారనగర్: ఢిల్లీలో ఈనెల 12నుంచి 14వరకు నిర్వహించిన జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా విద్యార్థి కొల్లు మహేందర్ ప్రతిభ కనబరిచాడు. ఖమ్మం కృష్ణవేణి కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆయన ‘ప్రమాదాలను నిరోధించే ఆరోగ్య హెచ్చరికలతో కూడిన స్టీరింగ్’ ప్రాజెక్టును ప్రదర్శించాడు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం, మద్యం సేవిస్తే గుర్తించడం, నిద్రమత్తులో ఉన్నప్పుడు హెచ్చరించడం, అత్యవసర సమయంలో డోర్ ఆపరేషన్, మార్గంలోని అడ్డంకులను గుర్తించడం వంటివన్నీ ఒకే వ్యవస్థలో పొందుపరిచాడు. బస్సు ప్రమాదాలను తగ్గించి ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రకటించిన బహుమతిని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ చేతుల మీదుగా మహేందర్ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనను కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు ఎం.కోటేశ్వరరావు, జి.జగదీష్, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ మోడెం వెంకన్న, అకడమిక్ డీన్లు ఏలూరి వంశీకృష్ణ, ఎం.లక్ష్మీనారాయణ, ఏఓ నిరంజన్ అభినందించారు.
బస్సు ప్రమాదాలు తగ్గించేలా
ప్రాజెక్టు రూపకల్పన


