నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు కృషి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు కృషి

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

తిరుమలయపాలెం: అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. మండలంలోని హైదర్‌సాయిపేట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు బ్యాక్‌ ఫీడింగ్‌ సప్‌లై కోసం ఏర్పాటుచేసిన నూతన లైన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా సరఫరా కోసం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ నుంచి హైదర్‌సాయిపేట సబ్‌ స్టేషన్‌ వరకు రూ.80లక్షల వ్యయంతో 6.3 కి.మీ. నూతన లైన్‌ ఏర్పాటుచేశామని తెలిపారు. తద్వారా పలు గ్రామాలకు నిరంతరంగా, ఇంకొన్ని గ్రామాలకు అవసరమున్నప్పుడు సరఫరా చేయొచ్చని చెప్పారు. డీఈలు బి.వెంకటేశ్వరరావు, భద్రుపవార్‌, ఉద్యోగులు బాబూరావు, కోక్యానాయక్‌, నరేందర్‌రెడ్డి, కిలారు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement