భద్రాచలంటౌన్: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి క్షేత్ర మహిమను చాటిచెప్పే భద్రాద్రి క్షేత్ర దర్శిని డాక్యుమెంటరీ విడుదల చేసినట్లు చిత్ర బృందం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్ర చరిత్ర ను, ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్లకు కట్టేలా రూపొందించిన చిత్రాన్ని ఓటీటీ వేదికగా ‘ఆహా’లో ప్రసారం చేస్తున్నారు. డాక్యుమెంటరీకి కృష్ణ ప్రభాత్ శర్మ వివరణ అందించగా, సాయి భారతి నిర్మాతగా వ్యవహరించారు. అభిలాష్ దర్శకత్వ పర్యవేక్షణలో, వెంకట్ ఛాయాగ్రహణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. శ్రీ వెంకట్ సంగీతాన్ని అందించారు.


