ఖమ్మంరూరల్: మండలంలోని తల్లంపాడు శివారులో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న 6.556 కిలోల గంజాయి లభించింది. ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... విజయవాడకు చెందిన జయరాం, తేజ వద్ద గంజాయి కొనుగోలు చేసిన తరపరెడ్డి భాస్కర్‌మణికుమార్, తోట సిరి బస్సులో ఖమ్మం తీసుకొచ్చారు. ఆపై ఖమ్మంలో కొంత గంజాయిని ఓ వ్యక్తికి అప్పగించి మిగతాది కోదాడకు చెందిన శివరామ, శ్రీరామ్ సహకారంతో అద్దె కారులో హైదరాబాద్ తరలిస్తున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ప్రణయ్‌కు గంజాయి అందించేందుకు వెళ్తుండగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈమేరకు గంజాయి, కారు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.


