
●ఇంటింటా చందా.. కోతులకు బందీఖానా!
కామేపల్లి మండలం ఊట్కూర్ వాసులను కొద్దినెలలుగా కోతుల బెడద వేధిస్తోంది. పలుమార్లు చిన్నారులు, వృద్ధులను గాయపర్చడమే కాక ఇళ్లలోకి చొరబడి సామగ్రి ఎత్తుకెళ్తున్నాయి. అంతేకాక పంట పొలాలపై దాడి చేస్తుండడంతో రైతులకు నష్టం మిగులుతోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక గ్రామస్తులంతా ఏకమై ఇంటికి రూ.500 నుంచి రూ.వేయి వరకు
వసూలు చేశారు. ఆపై కోతులు పట్టేవారిని సంప్రదించి ఒక్కో కోతికి రూ.250 చొప్పున
చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో కోతులు పట్టే బృందం సభ్యుడు బాలరాజు ఆధ్వర్యాన గురువారం ఒకేరోజు 400 కోతులను బంధించారు. వీటిని ఇనుప బోనులో ఉంచి ఆహారం సమకూర్చడంతో పాటు రాత్రి సమయాన అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో కోతుల బెదడ తప్పినట్లయిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – కామేపల్లి