
జ్యూస్ తాగుతూ కుప్పకూలిన యువకుడు
ఇబ్రహీంపట్నం రూరల్: జ్యూస్ తాగుతుండగా గుండెపోటు రావడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పల్లిపాడుకు చెందిన మేడ ఏకలవ్య(30) కొన్నాళ్లు యూకేలో ఉద్యోగం చేశాడు. ఆపై ఉద్యోగం కోల్పోవడంతో ఇబ్రహీంపట్నంలోని తన స్నేహితుడు ఆకాష్‌పటేల్ వద్ద ఉంటున్నాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆయన జ్యూస్ తాగుతుండగా గుండెపోటుతో రావడంతో పడిపోయాడు. దీంతో పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆస్పత్రికి తరలించేలోపే మృత్యువాత