
●మజ్జిగ త్రినేత్ర
చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలమనేరు గ్రామానికి చెందిన త్రినేత్ర తండ్రి మునెప్ప వ్యవసాయం చేస్తుండగా తల్లి సరోజమ్మ గృహిణి. టీజీ టెట్‌లో 123, డీఎస్సీ78.9 మార్కులతో ఉద్యోగం సాధించిన ఆయన రామచంద్రాపురం మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇక ఏపీ టెట్‌లో 141.79, డీఎస్సీ 90.79 మార్కులు సాధించింది. క్రమశిక్షణ, పట్టుదలతో చదవడం ద్వారా ఉద్యోగాలు సాధించానని వెల్లడించారు. తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూస్తూ వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని భావనతో చదవడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.