
●రుద్రపంక్తి సంతోష్ కుమార్
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సంతోష్ తండ్రి మల్లేశ్వరరావు ఆ గ్రామ శివాలయంలో పూజారిగా పనిచేస్తుంటారు. తల్లి శైలజ గృహిణి. టీజీ టెట్‌లో 132, డీఎస్సీలో మూడో ర్యాంకు సాధించి మధిర ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఏపీ టెట్‌లో 139, అక్కడి డీఎస్సీలో 85.25 మార్కలు సాధించాడు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ఆర్థిక సమస్యలను అధిగమించి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో సిద్ధమయ్యానని వెల్లడించారు. హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు షేక్ షావలీ ప్రోత్సహించగా, డీఎస్సీకి అకాడమీ పుస్తకాలు చదువుతూ సొంతంగానే నోట్స్ సిద్ధం చేసుకున్నానని చెప్పారు. దీంతో నాన్ లోకల్ కోటాలో తెలంగాణలో, లోకల్ కోటాలో ఏపీలోనూ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. మధిర పాఠశాలలో కొద్దికాలమే పనిచేసినా విద్యార్థుల ఉన్నతికి బాధ్యతాయుతంగా వ్యవహరించానని, ఫలితంగా సహచర ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మన్ననలు అందాయని వెల్లడించారు.