
జ్ఞానమే ఆయుధం కావాలి
సత్తుపల్లిరూరల్: విద్యార్థులు జ్ఞానాన్నే ఆయుధంగా చేసుకోవాలని, తద్వారా అదే బలంగా మారి ఉన్నత స్థానాలను చేరుస్తుందని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి తెలిపారు. సత్తుపల్లి మండలం గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో కళాశాలను ఏర్పాటుచేసి నాణ్యమైన విద్య అందిస్తుండడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయటం అద్భుతమైన మైలురాయిగా నిలిచేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని చెప్పారు. విపాసన ఎడ్యూకేషనల్ ట్రస్టీ బండి అన్విద మాట్లాడగా కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ఊటుకూరి శేషారత్నకుమారి, మీరాసాహెబ్, షేక్ యాకూబ్, కొండా రవికుమార్, టి.శేషసాయి, రామకృష్ణ ప్రసాద్, వీరన్న, కృష్ణారెడ్డి, శేఖర్‌బాబు పాల్గొన్నారు.
ఎంపీ, హెటిరో అధినేత పార్థసారధిరెడ్డి