
●యాభై ఏళ్ల స్నేహం
మధిర: మధిర లడకబజార్‌కు చెందిన చెరుపల్లి శ్రీహరి, రావిరాల శశికుమార్, కాలం యుగంధర్, చెరుపల్లి శ్రీధర్, కంచి కృష్ణ, ఆలా ఆరోగ్య వరప్రసాద్, కోడెం రమణ, ఎస్.కే.యూనిస్, పాసికంటి రవి, కుడుముల శ్రీనివాసరావు మధ్య 50 ఏళ్ల కిందట ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఇందులో ఐదేళ్ల కిందట కుడుముల శ్రీనివాసరావు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబానికి అంతా అండగా నిలవడమే కాక ఆయన పేరిట ఏటా పేదలకు అన్నదానం చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడిన వీరు తరచుగా కలుసుకోవడమే కాక ఎవరి ఇళ్లల్లో ఏ కార్యక్రమం జరిగినా సమష్టిగా బాధ్యతలు పంచుకుంటారు. అంతేకాక ఏటా విహారయాత్రలకు వెళ్తున్నారు.