
మేమంతా ఉన్నాం..
నీ కోసం నేనున్నా అనే ఆత్మీయ స్పర్శే స్నేహం. నిరాశ, నిస్పృహలు చుట్టుముట్టినా, భరించలేని కష్టం ఎదురైనా అండగా నిలబడే వారే స్నేహితులు. ప్రతిఫలంగా హితం కోరే వారిని నిజమైన స్నేహితులుగా భావిస్తారు. అలాంటి స్నేహం ఏళ్లు గడిచినా, స్థాయి మారినా కొనసాగితేనే ఆనందం! పలువురు తమ బృందంలోని వారికి సుఖాల్లోనే కాక కష్టాల్లోనూ తోడుగా నిలుస్తూ స్నేహబంధాన్ని చాటుతున్నారు. ఇంకొందరు స్నేహితులు బృందాలుగా ఏర్పడి ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తున్నారు. నేడు (ఆదివారం) అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అలాంటి బృందాల్లో కొందరి కథనాలు.
● స్నేహం.. ఓ మాధుర్యం ● ఏళ్లు గడిచినా, స్థాయి పెరిగినా తగ్గని మైత్రి ● కష్టసుఖాల్లో అండగా నిల్తున్న మిత్రులు
నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం
●డిగ్రీ స్నేహం.. చెదరని బంధం
ఖమ్మంమయూరిసెంటర్: పాతికేళ్ల కిందట పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మొదలైన స్నేహం నేటికీ కొనసాగుతోంది. 1998–2001లో డిగ్రీ చదివిన జె.శివలింగం, శ్రీనివాసరావు, సత్యనారాయణ, త్రివేణి మధ్య ఏర్పడిన స్నేహం ఎక్కడా ఆగిపోలేదు. డిగ్రీ తర్వాత జె.శివలింగం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా, సత్యనారాయణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా, శ్రీనివాసరావు ఫార్మా రంగంలో, త్రివేణి ఉపాధ్యాయురాలిగా స్థిరపడ్డారు. కానీ, స్నేహం అలాగే ఉండటం, నలుగురి కుటుంబాలూ కలిసి ఆనందాల్లో పాలుపంచుకుంటూ, కష్టాల్లో అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు.

మేమంతా ఉన్నాం..