
●సేవలో మేటి.. యువ భారత్‌శక్తి
సత్తుపల్లిటౌన్: ఇంటర్, బీటెక్ కలిసి చదువుకున్న తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల వారు స్నేహబంధాన్ని కొనసాగిస్తూ యువభారత్ శక్తిగా ఏర్పడ్డారు. సత్తుపల్లికి చెందిన కామెర క్రాంతి, గౌస్‌పాషా, శబరినాథ్ కలిసి 2014 నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆపై 2018లో యువభారత్‌శక్తి ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం ద్వారా ఎవరికి ఆపద ఉందని తెలిసినా అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు రూ.కోటి మేర సహాయం అందించడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 46 రక్తదాన శిబిరాల ద్వారా 5 వేల మందికి రక్తదాననం చేశారు. జిల్లాలోని 24 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.1.50 లక్షల విలువైన బ్యాగ్‌లు, కరోనా సమయంలో 60 రోజుల పాటు యాచకులు, వృద్ధులకు భోజనంతో పాటు వేయికి పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 2020లో రూ.11.35 లక్షలు, 2021లో రూ.13.82 లక్షలు 2022లో రూ.15.59 లక్షలు, 2023లో రూ.15.48 లక్షలు, 2024లో రూ.12.69 లక్షలు, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.7 లక్షల మేర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం అందించారు. కాగా, సేవాకార్యక్రమాలకు గాను పలు ఫౌండేషన్ల ద్వారా ‘యువభారత్ శక్తి’కి పురస్కారాలు లభించాయి.
స్నేహితులే నా బలం..
12 ఏళ్లుగా నిర్విరామంగా స్నేహితుల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా ఆర్థిక సాయం సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నాం. పది మందితో మొదలైన ఫౌండేషన్ ప్రస్తుతం 4 వేల మంది సభ్యులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
–కామెర క్రాంతి, యువభారత్‌శక్తి ఫౌండేషన్ ఫౌండర్
●

●సేవలో మేటి.. యువ భారత్‌శక్తి