
●మిత్ర ఫౌండేషన్ ఆపన్న హస్తం
ఖమ్మంగాంధీచౌక్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది మిత్ర ఫౌండేషన్. వ్యాపారం, వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడిన ఖమ్మానికి చెందిన ఈ బృందం సభ్యులు సామాజిక సేవ, చైతన్యం కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. గోదావరి, మున్నేటి వరదల సమయాన ముంపు ప్రాంతాల ప్రజలకు రూ.10 లక్షల విలువైన నిత్యావసరాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏటా సైకిళ్లు, బుక్స్, బ్యాగులు అందిస్తున్నారు. గత ఏడాది పదో తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.3 లక్షల విలువైన బహుమతులు ఇవ్వడమే కాక టాపర్లు ఐదుగురికి విమానంలో ఢిల్లీ యాత్రకు తీసుకువెళ్లారు. కురువెళ్ల ప్రవీణ్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మిత్ర ఫౌండేషన్‌లో రంగా శ్రీనివాస్, పాలవరపు శ్రీనివాస్, చారుగుండ్ల రవికుమార్, చెరుకూరి యుగంధర్, నాగసాయి గ్యాస్ నగేశ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.