
టీఏల అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో స్థానం
మధిర: ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ల రాష్ట్ర కమిటీని యాదగిరిగుట్టలో ఆదివారం ఎన్నుకున్నారు. ఈ మేరకు కమిటీలో జిల్లా నుంచి పలువురు టెక్నికల్ అసిస్టెంట్లకు స్థానం దక్కింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మేరుగు శ్రీని వాసరావు(పెనుబల్లి), ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆవుల సంతోష్‌కుమార్, జాయింట్ సెక్రటరీగా మద్దాల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యురాలిగా ఏ.సౌజన్య ఎన్నికయ్యారు. వీరిని జిల్లా అధ్యక్షుడు పగిడిపల్లి మనోహర్‌రావు, గౌరవ అధ్యక్షుడు షేక్ నజీర్, కోశాధికారి ఆదుర్తి రమేష్‌కుమార్ తదితరులు అభినందించారు.
నేటి నుంచి రాజీవ్ ట్రోఫీ
ఖమ్మం స్పోర్ట్స్: రాజీవ్ స్మారక అండర్–12, 14, 16 క్రికెట్‌పోటీలు మంగళవారం ప్రారంభం కాను న్నాయి. అండర్–12 ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో, అండర్–14 కొత్తగూడెంలో, అండర్– 16 బాలుర క్రికెట్ పోటీలు కల్లూరు మినీ స్టేడియంలో నిర్వహిస్తామని టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.డీ.మతిన్ తెలిపారు. ఇప్పటికే పలు జట్ల బాధ్యులు పేర్లు నమోదు చేసుకోగా, ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యాన టోర్నీ నిర్వహణకు ఏర్పా ట్లు చేశామని వెల్లడించారు.
10న ఉమ్మడి జిల్లా
టీ.టీ. జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 10 తేదీన ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఉమ్మ డి జిల్లా అధ్యక్షుడు బాలసాని విజయ్ తెలి పారు. 11 – 19 ఏళ్ల వయసు కలిగిన బాలబాలికలతో పాటు ఓపెన్ విభాగంలో పురుషులు, మహిళల జట్లను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీల్లో పాల్గొనేందుకు జట్లను ఎంపిక చేయనుండగా ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 10న ఉదయం 9గంటలకు జనన ధ్రువీకరణ పత్రంతో పాటు ఒక పాస్‌పోర్టు సైజు ఫొటోతో పటేల్ స్టేడియంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. వివరాలకు కార్యదర్శి 98484 08335 నంబర్‌లో సంప్రదించాలని విజయ్ తెలిపారు.
ఇన్‌స్ట్రక్టర్ కుటుంబానికి రూ.1.88లక్షల ఆర్థికసాయం
తల్లాడ: మండలంలోని రామచంద్రాపురానికి చెందిన యోగా ఇన్‌స్ట్రక్టర్ కందుల శ్రీదేవి ఇటీవల డెంగీతో మృతి చెందింది. ఈమేరకు తెలంగాణ యోగా టీచర్ల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యాన సేకరించిన రూ.1.88లక్షలను ఆమె కుమార్తె చదువుకు సోమవారం అందజేశారు. ఇన్‌స్ట్రక్టర్లు, యోగా కోఆర్డినేషన్ కమిటీ మహిళా సభ్యులు, యోగా సంస్థల నుంచి ఈ నగదు సేకరించినట్లు తెలిపారు. డాక్టర్ సత్యరెడ్డి, రవికుమార్, బాహర్ అలీ, వెంకటేశ్వర్లు, పద్మావతి, ఝాన్సీ, లక్ష్మి, సత్యనారాయణ, శ్రీకాంత్, కొండల్‌రావు, అజ్మీరా నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
17మంది వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై 17 మంది వైద్యులను నియమించనున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కె.రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. ఆరుగురు గైనకాలజిస్ట్‌లు, ముగ్గు రు అనస్తీషియన్లు, ఇద్దరు చొప్పున ఆఫ్తాల్మిక్, పీడియాట్రిక్ వైద్యులతో పాటు ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ విభాగాల్లో ఒక్కో పోస్టు ఉందని వెల్లడించారు. అర్హులైన వైద్యులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల అటెస్టెడ్ జిరాక్స్‌లతో పాటు రెండు ఫొటోలతో ఈనెల 6న ఉదయం కలెక్టరేట్‌లోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు.

టీఏల అసోసియేషన్ రాష్ట్ర కమిటీలో స్థానం