
రెండు మండలాల్లో భారీ వర్షం
తిరుమలాయపాలెం/కూసుమంచి: తిరుమలాయపాలెం మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి సమయాన రెండున్నర గంటల పాటు వర్షం దంచికొట్టగా రికార్డు స్థాయిలో 8.5 సెం.మీ.గా వర్షపాతం నమోదైంది. ఇప్పటికే భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి చెరువులకు నీరు వదలగా ఈ వర్షంతో బీరోలు, జూపెడ, హస్నాబాద్, ఎదుళ్లచెరువు, బచ్చోడు తదితర గ్రామాల చెరువుల్లోకిభారీగా వరద చేరి అలుగు పోశాయి. పలుచోట్ల వరి పొలాలు, పత్తి చేన్లు కోతకు గురవడమే కాక ఇసుక మేటలు వేశాయి. ఇక కూసుమంచి మండలంలోనూ వర్షంతో నర్సింహులగూడెం – కొత్తూరు, నర్సింహులగూడెం – కిష్టాపురం మధ్య వాగు వరద రోడ్లపైకి చేరి రాకపోకలు స్తంభించాయి. అంతేకాక తురకగూడెంవద్ద కూసుమంచి వెళ్లే బీటీ రహదారి కోతకు గురవగా, పత్తి చేన్లలో ఇసుక మేటలు వేసింది.
తిరుమలాయపాలెం రికార్డు స్థాయిలో
8.5 సెం.మీ.గా నమోదు

రెండు మండలాల్లో భారీ వర్షం

రెండు మండలాల్లో భారీ వర్షం