
●నా బిడ్డలకు భవిష్యత్ ఇవ్వండి..
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా దుగ్గిరాలపాడుకు చెందిన గోపమ్మ తన ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రజావాణికి వచ్చింది. ఆమెకు చింతకాని మండలం ప్రొద్దుటూరు వాసితో వివాహం జరగగా.. ఆరేళ్ల నుంచి గోపమ్మ, పిల్లలను భర్త పట్టించుకోవడం లేదు. పిల్లల పేరిట రెండెకరాల భూమి రాస్తామని చెప్పిన భర్త, కుటుంబీకులు ఇప్పుడు అమ్మకానికి యత్నిస్తుండడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. భూమి అమ్మకుండా అడ్డుకోవాలని కోరడమే కాక పిల్లలకు వారసత్వ పట్టా అయ్యేలా చూడాలని కలెక్టరేట్‌లో అధికారులకు విన్నవించింది. ప్రజావాణి ప్రారంభం కాకుముందే వచ్చిన ఆమె పిల్లలను టిఫిన్ చేయిస్తుండగా వివరాలు ఆరా తీయడంతో తన గోడు వెళ్లబోసుకుంది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్