
●స్నేహంతో పాటు సమాజహితం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మానికి చెందిన తూములూరి లక్ష్మీనరసింహారావు, పెనుగొండ శ్రీనివాసరావు, పల్లా లింగయ్య, బజ్జూరి రమణారెడ్డి, సోమారపు సుధీర్‌కుమార్, సూరినేటి మల్లేశం, దేవరశెట్టి రామారావు, పెనుగొండ సాయికుమార్, మోతుకూరి భద్రయ్య, ఎంఎస్.పుల్లారావు, జి.సూర్యనారాయణ, జంగిలి రమణ, మిట్టపల్లి రాధాకృష్ణ తదితరుల మధ్య ముప్పై ఏళ్లుగా స్నేహం కొనసాగుతోంది. జ్యోతి నివాసంలో ఉంటున్న అంధ, మూగ, చెవిటి విద్యార్థులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం హైస్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, పరీక్ష సామగ్రి, అంగన్‌వాడీ కేంద్రాలకు తాగునీటి ఫిల్టర్లు అందించగా.. ఓ షాప్‌లో గుమస్తా హరిప్రసాద్ ఇద్దరు కూతుళ్ల చదువులకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఏటా వేసవిలో హర్కారా బావి సెంటర్‌లో మజ్జిగ పంపిణీ చేసే ఈ బృందం సభ్యులు... కరోనా సమయాన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల సహాయకులకు నిత్యం భోజనం సమకూర్చారు.