
జాతీయ సదస్సులో ఖమ్మం న్యాయవాది
ఖమ్మంలీగల్: కాంగ్రెస్ లీగల్ సెల్ జాతీయ కమిటీ ఆధ్వార్యన ఢిల్లీలో శనివారం రాజ్యాంగ పరిరక్షణ న్యాయవాద సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో లీగల్‌సెల్ రాష్ట్ర కన్వీనర్, ఖమ్మంకు చెందిన సింగం జనార్దన్ పాల్గొన్నా రు. 150 మంది న్యాయవాదులు పాల్గొనగా పలు అంశాలపై చర్చించినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
లాలాపురం వాసికి డాక్టరేట్
కొణిజర్ల: మండలంలోని లాలాపురం గ్రా మానికి చెందిన ఇమ్మడి శ్రీనివాస్‌కు తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. శ్రీనివాస్ ఎంఏ, ఎంఫిల్ పూర్తిచేశాక అన్నామలై యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ విల్లయికరసి పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలి
ఖమ్మంవైద్యవిభాగం/ఖమ్మం అర్బన్: ప్రభు త్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఆర్‌టీఐ కమిషనర్ పీ.వీ.శ్రీనివాసరావు సూచించారు. కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని శనివా రం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు అందిన దరఖాస్తులు, పరిష్కారంపై ఆరా తీశాక జిల్లా పౌరసంబంధాల అధికారి కా ర్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండేళ్ల పాటు ఆర్‌టీఐ కమిషనర్ నియామకం లేక వేలా ది కేసులు పేరుకుపోయినందున త్వరగా పరిష్కరించేలా జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రతీ ప్రభుత్వ కార్యాలయం వద్ద సమాచార హక్కు చట్టం బాధ్యుల వివరాలు, ఫోన్ నంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. అలాగే, ఖమ్మం ఇందిరానగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీనివాసరా వు విద్యార్థులతో మాట్లాడడంతో పాటు వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జాతీయ సదస్సులో ఖమ్మం న్యాయవాది