
●ఒకరికొకరుగా పూర్వవిద్యార్థులు
ముదిగొండ: ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా ఈ స్నేహబంధం కొనసాగుతోంది. ఏటా ఓ వేదికపై కలుస్తూ ఆ సంవత్సరం చేయాల్సిన మంచి పనులు నిర్ణయించుకుని ముందుకు సాగు తున్నారు. మండలంలోని బా ణాపురం పాఠశాలలో ఒకటి నుంచి పదోతరగతి వరకు (2005–06 బ్యాచ్) చదివిన పూర్వ విద్యార్థులు సంఘంగా ఏర్పడ్డారు. ఈ బృందంలో 45 మంది ఉండగా.. 2023 నుంచి ఎవరికి ఏం జరిగినా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ చేయూతనిస్తున్నారు. 2023లో ఏన్కూరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఈ బృందానికి చెందిన వేణు మృతి చెందగా ఆయన ఇద్దరు కుమార్తెల పేరిట రూ.50 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. 2024లో మరో స్నేహితురాలి భర్త అనారోగ్యంతో బాధపడుతుంటే చికిత్సకు రూ.40 వేలు అందించి ఆదుకున్నారు. మరో కుటుంబానికి రూ.13 వేల నిత్యావసర సరుకులు అందించగా.. ఇంకో స్నేహితుడు మృతి చెందగా రూ.40 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
అండగా అందరం..
కలిసి చదువుకున్న మేం ఏటా సమావేశమై మంచీచెడు చర్చించుకుంటాం. వృత్తి, వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు, శుభకార్యాలపై మాట్లాడుకుంటాం. అలాగే, మా బ్యాచ్‌కు సంబంధించిన ఎవరికి ఆపద వచ్చినా అంతా కలిసి అండగా నిలుస్తున్నాం. –బెందు లక్ష్మణ్, బాణాపురం
కలిసికట్టుగా.. తోడునీడగా
ఎక్కడ పనిచేస్తున్నా.. ఎంత దూరంలో ఉన్నా మా బృందంలో ఎవరికై నా సమస్య ఎదురైందంటే వెంటనే వచ్చేస్తాం. శుభకార్యాలకు బహుమతులు ఇవ్వడమే కాక ఇబ్బందుల్లో ఉన్న వారిని అండగా నిలుస్తున్నాం. అందరం కలసికట్టుగా, తోడునీడగా కొనసాగుతున్నాం. –డీకొండ వెంకటేశ్, బాణాపురం
●

●ఒకరికొకరుగా పూర్వవిద్యార్థులు

●ఒకరికొకరుగా పూర్వవిద్యార్థులు