
రేపు జాబ్‌మేళా
ఖమ్మంసహకారనగర్: హెచ్‌సీఎల్ టెక్ ఆధ్వర్యంలో 2023–24, 2024–25 విద్యా సంవత్స రాల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ రంగంలో ఐటీ, డీపీఓ ఉద్యోగాల్లో అవకాశం కల్పించేందుకు ఈ నెల (ఆగస్టు) 2న నగరంలోని నయాబజార్ జూనియర్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్న ట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కె.రవిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 75 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, ఆసక్తి ఉన్నవారు 2న నయాబజార్ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటలకు పది, ఇంటర్మీడియట్ మెమోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ పొటో, ఆండ్రాయిడ్ మొబైళ్లతో హాజరు కావాలని, పూర్తి వివరాల కోసం 83414 05102, 79818 34205 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
జాబ్‌మేళాలో
23మంది ఎంపిక
ఖమ్మం రాపర్తినగర్: జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యాన గురువారం ఖమ్మం టేకులపల్లి లోని మోడల్ కెరీర్ సెంటర్‌లో జాబ్‌మేళా నిర్వహించారు. వివిధ కంపెనీల బాధ్యులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించగా 51 మందిలో 23 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రేగులచలకలో
కేంద్రబృందం పరిశీలన
రఘునాథపాలెం: కేంద్రప్రభుత్వ పథకాల అమలు, చేపట్టిన అభివృద్ధి పనులను మండలంలోని రేగులచలకలో నేషనల్ లెవల్ మానిటరింగ్(ఎన్‌ఎల్‌ఎం) బృందం పరిశీలించింది. ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన పనులు, రిజిస్టర్ల నిర్వహణపై ఆరా తీశాక ఉపాధిహామీ కూలీలు, డ్వాక్రా మహిళలు, గ్రామ సంఘం సభ్యులతో సమావేశమై పథకాల ద్వారా జరిగిన లబ్ధిని తెలుసుకున్నారు. అలాగే, గ్రామపంచాయతీ రికార్డులను కూడా తనిఖీ చేసిని బృందం వృద్ధా ప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్ లబ్దిదారులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం అంగన్‌వాడీల్లోని టాయిలెట్లు, అవె న్యూ ప్లాంటేషన్, నర్సరీలు, సీసీ రోడ్ల పనులను పరిశీలించారు. కేంద్ర బృందంలో డాక్టర్ డీ.డీ.గరుడ, ఎన్.అశ్విన్ గోపాల్‌తో పాటు ఎంపీడీఓ అశోక్‌కుమార్, వివిధ శాఖల ఉద్యోగులు చలపతిరావు, శ్రీదేవి, పద్మయ్యనాయుడు, శ్రీనివాస్, శ్రీనివాసరావు, దీపక్, మాజీ ఉపసర్పంచ్ యండపల్లి సత్యం, అన్నం భూషయ్య పాల్గొన్నారు.
పదవీ విరమణ
ఉద్యోగులకు సన్మానం
ఖమ్మక్రైం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ ఉద్యోగులను సీపీ సునీల్‌దత్ గురువారం సన్మానించారు. ఖమ్మంలోని కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకే కాక ప్రజలకు సేవలు చేశారని కొనియాడారు. ఈమేరకు ఏఆర్ ఎస్సై మోహన్‌రావుతో పాటు ఏఎస్సైలు ముత్తయ్య, లచ్చు, ఉద్యోగులు సైదయ్య, మన్సూర్, బాలకృష్ణ, వెంకయ్య, ఆనందరావును సన్మానించగా అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, ఏఆర్ ఏసీపీ నర్స య్య, ఆర్‌ఐలు కామరాజు, సురేష్, నాగుల్‌మీరా, పోలీస్ ఉద్యోగుల అసోసియేషన్ ఇన్‌చార్జ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పెద్దాస్పత్రిలో
మోకీలు శస్త్రచికిత్స
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు మోకీలు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 55ఏళ్ల బి.కల్యాణి మోకాలి నొప్పితో చాన్నాళ్లుగా బాధపడుతుండగా, పెద్దాస్పత్రి వైద్యులను సంప్రదించింది. దీంతో పరీక్షలు చేశాక ఆస్పత్రి ఆర్థోపెడిక్ హెచ్‌ఓడీ ఎల్.కిరణ్‌కుమార్ ఆధ్వర్యాన గురువారం ఆమెకు మోకీలు శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్సలో హెచ్‌ఓడీతో పాటు వైద్యులు వినయ్‌కుమార్, మణికంఠ, మనీష్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే ఆయిల్‌పామ్
కారేపల్లి: ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్‌తో లాభాలు ఎక్కువగా వస్తాయని జిల్లా ఉద్యా న, పట్టు పరిశ్రమ శాఖాధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. మండలంలోని చీమలపాడులో పలువురు రైతులు సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటలను గురువారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. కోతుల బెడద, చీడపీడలు లేకపోవడమే కాక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఆయిల్‌పామ్ తట్టుకుంటుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఫ్యాక్టరీలు కూడా ఉన్నందున మార్కెటింగ్ సమస్య ఉండదని చెప్పారు. ఇవికాక ప్రభుత్వం రాయితీపై మొక్కలు ఇవ్వడంతో పాటు నిర్వహణ ఖర్చులు, సబ్సిడీపై డ్రిప్ అందజేస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకో వాలని మధుసూదన్ సూచించారు. వైరా డివిజ న్ ఉద్యానవన అధికారి ఆకుల వేణు, ఫీల్డ్ ఆఫీస ర్ శ్రావణి, రైతు పోతుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.