బీఆర్క్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
ఖమ్మంసహకారనగర్: జేఈఈ మెయిన్స్ పేపర్–2(బీ–ఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు విద్యార్థులను అభినందించి మాట్లాడారు. పి.సాయికుమార్ ఆలిండియా 55, ఎ.గోవర్దన్ 129 ర్యాంకు సాధించారని తెలిపారు. అలాగే, వి.ప్రణతి 210వ ర్యాంక్, ఎం.ప్రహ్లాద్ 275, బి.వంశీ 292, వి.కుశాల్ 339, డి.అరుణ్ 368, హనుమంత్ సాయి 493, పి.సాయిప్రకాష్ 570 ర్యాంకులు సాధించగా.. 594, 620, 710,712, 728, 751, 778, 892, 918, 953, 982 ర్యాంకులు తమ విద్యార్థులకు వచ్చాయని వెల్లడించారు.


