
పుష్కరాల యాత్ర విజయవంతం కావాలి
ఖమ్మం మామిళ్లగూడెం: కాళేశ్వరం శ్రీ సరస్వతి పుష్కరాలకు వెళ్తున్న బస్సు యాత్ర విజయవంతం కావాలని ఖమ్మం వన్‌టౌన్ సీఐ తాటిపాముల కరుణాకర్ కోరారు. గురువారం ఖమ్మం జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్‌తో పాటు జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు పుష్కరాలకు వెళ్తుండగా.. ఖమ్మం గాంధీ పార్క్ నుంచి వెళ్లే బస్సును సీఐ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ మాట్లాడాక..సీఐను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెలిగేటి విజయలక్ష్మి, జయ, సభ్యులు అనాసి రాధాకృష్ణ, సాదినేని జనార్ధన్‌రావు, రాయల వెంకటేశ్వర్లు, వేగినాటి లక్ష్మయ్య, కేదాసు నరసయ్య, కె.సత్యనారాయణరెడ్డి, శ్రీహరి, జల్లా వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, లక్ష్మి, రమాదేవి, నాగమణి, లలిత, పద్మ, శ్రీలక్ష్మి, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.