
విద్యార్థులను మరింతగా తీర్చిదిద్దాలి
ముదిగొండ: ప్రభుత్వం అందించే శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులకు మరింత మెరుగైన బోధన చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అద్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు కోరారు. ముదిగొండ జెడ్పీహెచ్‌ఎస్‌లో జరుగుతున్న శిక్షణ శిభిరాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మెరుగైన బోధనతో పాఠశాలల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కాగా, వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు కృషి చేస్తామని చెప్పారు. పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు బంకా గురువయ్య, ఎన్.సాంబశివరావుతో పాటు కట్టా శేఖర్, టి.రత్నకుమార్ పాల్గొన్నారు.
నవజాత శిశువుల మరణాల నివారణే లక్ష్యం
నేలకొండపల్లి: నవజాత శిశువుల మరణాల నివారణే లక్ష్యంగా నియోనాటల్ సేవలు అందిస్తున్నట్లు ఈఎంఆర్‌ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఉమ్మడి జిల్లా పోగ్రామ్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని సీహెచ్‌సీ వద్ద శనివారం నియోనేటల్ సేవలపై ఉద్యోగులకు ఆయన అవగాహన కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 49 అంబులెన్స్‌లుఉండగా, ఒక్కో వాహనం ద్వారా కనీసం నెలకు 120 రకాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు తొలిసారిగా నియోనాటల్ వాహనం మంజూరైందని, ఇందులో అత్యాధునిక వైద్య పరికరాలు, ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు దుర్గాప్రసాద్, భాస్కర్, సీతారాం, డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను మరింతగా తీర్చిదిద్దాలి