
మెరిసిన హార్వెస్ట్ విద్యార్థులు
ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్స్ బీ–ఆర్క్, ప్లానింగ్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ఆల్‌ఇండియా టాప్ ర్యాంకులు సాధించారని హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల యాజమాన్యం వెల్లడించింది. ఎన్‌సీహెచ్.జస్వంత్‌సాయి 38వ ర్యాంకు, ఎం.నాగయశ్వంత్ 117, వై.సాయినేహా 128, బి.ప్రణీత 141, వేముల సాయిదీపక్ 206, పి.క్రిష్‌సాత్విక్ 225, వి.శరణ్ గోపాల్‌స్వామి 253, ఎన్.రాఘవేంద్ర నవనీత్ 302, కందుల రోహిత 346, కమతం విన్య 363 ర్యాంకులు సాధించారని కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారితో పాటు అధ్యాపకులు అభినందించారు.