
అహర్నిశలు కష్టంతోనే ఈ స్థాయికి...
ఖమ్మం మామిళ్లగూడెం: విద్యార్థి దశ నుండి ప్రగతిశీల ఉద్యమాలు, జీవితంలో ఆటుపోట్లు, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుగా పడిన కష్టమే తనను ఈ స్థాయికి చేర్చిందని సమాచార హక్కు చట్టం కమిషనర్ పీ.వీ.శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా నియమితులైన ఆయనను శనివారం ఖమ్మంలో వివిధ సంఘాల ఆధ్వర్యాన సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ స్నేహితులు తనను సన్మానిస్తుండడాన్ని గర్వంగా భావిస్తున్నానని, ఇదే సమయంలో నూకల నరేష్‌రెడ్డి, తన తల్లితో పాటు బుడాన్ బేగ్ ఉంటే మరింత సంతోషించేవారని తెలిపారు. అనంతరం ఆయన సతీమణి సృజన మాట్లాడగా ‘ఆ చల్లని సముద్ర గర్భం’ పాట పాడి ఉద్యమ రూపాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ జీ.వీ. బిచ్చాల తిరుమలరావు, ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షత వహించగా టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా కార్యదర్శి చిర్రా రవి, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వరావు, ఏనుగు వెంకటేశ్వరావుతో పాటు వెన్నబోయిన సాంబశివరావు, ఉషాకిరణ్, కే.వై.రామచందర్రావు, డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, జైపాల్, కూరపాటి రంగరాజు, కె.దిలీప్, యర్రమల్ల శ్రీను, నందగిరి శ్రీను, సాగర్, డాక్టర్ నారాయణరావు, విప్లవ్‌కుమార్, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, నల్లమల వెంకటేశ్వరావు, గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, యలమందల జగదీష్, మందుల ఉపేందర్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీఐ కమిషనర్ పీ.వీ.శ్రీనివాస్