
సన్న ధాన్యం బోనస్ జమ
జిల్లాలో 9,156 మంది రైతులకు రూ.35.73 కోట్లు
నేలకొండపల్లి: యాసంగి సీజన్‌లో సన్నధాన్యం సాగు చేసి ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించిన రైతులకు ప్రభుత్వం బోనస్ విడుదల చేసింది. ఈమేరకు జిల్లాలోని 9,156 మంది రైతులు 7,14,798.40 క్వింటాళ్ల ధాన్యం విక్రయించగా, వీరి ఖాతాల్లో క్వింటాకు రూ.500 చొప్పున రూ.35,73,99,200 కోట్ల బోనస్ శనివారం జమ చేశారు. ఈసందర్భంగా మండలాల వారీగా రైతులు, విక్రయించిన ధాన్యం, అందించిన బోనస్ వివరాలను వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా నేలకొండపల్లి మండలంలో 2,356 మంది రైతుల నుంచి 1,73,527.60 క్వింటాళ్లు, బోనకల్ మండలంలో తక్కువగా 16 మంది రైతుల నుంచి 635.60 క్వింటాళ్ల సన్నధాన్యం కొనుగోలు చేశారు.