సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

May 25 2025 12:11 AM | Updated on May 25 2025 12:13 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి తన సిఫారసుతో మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అందజేశారు. ఖమ్మంలోని క్యాంప్‌ కార్యాలయంలో రూ. 2.50 లక్షల విలువైన చెక్కలను శనివారం ఆయన అందించి మాట్లాడారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్‌ తోట వీరభద్రం, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లేడిబోయిన గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి

ఉషూ పోటీలకు ఎంపిక

ఖమ్మంస్పోర్ట్స్‌: సబ్‌ జూనియర్‌ విభాగం నుంచి రాష్ట్రస్థాయి ఉషూ పోటీల్లో ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులు ఇద్దరు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టులో స్థానం సాధించారు. ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో సాధన చేస్తున్న శశివర్ణిక 22 కేజీల (సాన్‌–ద) బాక్సింగ్‌ బాలికల విభాగంలో, వింగ్‌చున్‌ బాలుర విభాగంలో చక్రధర్‌ ఆర్యన్‌ ఎంపికయ్యారని ఉషూ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పి.పరిపూర్ణచారి తెలిపారు. తమిళనాడులోని నమ్మక్కల్‌ జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొననుండగా, డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి తదితరులు అభినందించారు.

ఓయూ నుంచి డాక్టరేట్‌

సత్తుపల్లి: సత్తుపల్లిలోని గీతమ్స్‌ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, అశ్వారా వుపేట మండలం ఆసుపాకకు చెందిన కును సోతు అశోక్‌కుమార్‌కు డాక్టరేట్‌ లభించింది. హైదరాబాద్‌లోని ఉస్మా నియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.రమాదేవి పర్యవేక్షణలో ఆయన సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి ఓయూ నుంచి డాక్టరేట్‌ ప్రకటించారు. వేరుశనగలో వచ్చే కాండం కుళ్లు తెగులును తక్కువ ఖర్చుతో, సైడ్‌ ఎఫెక్టులు లేకుండా నిరోధించేలా చేసిన పరిశోధనలపై అశోక్‌కుమార్‌ డాక్టరేట్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను గీతమ్స్‌ కళాశాల డైరెక్టర్‌ దొడ్డా శ్రీనివాసరెడ్డి, శాంతినికేతన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మమంద్రారెడ్డి, అధ్యాపకులు తదితరులు అభినందించారు.

రెవెన్యూ విభాగానికి విజిలెన్స్‌ నోటీసులు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం ద్వారా కొన్నేళ్లుగా జరిగిన కార్యకలాపాలకు సంబంధించి రికార్డులు సమర్పించాలని విజిలెన్స్‌ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇంటి నంబర్ల కేటాయింపు, మ్యుటేషన్‌, 58, 59 జీఓ పట్టాల ఇళ్లకు అసెస్‌మెంట్‌ నంబర్లు కేటాయింపు.. తదితర అంశాల్లో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలతో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. నోటీసులు అందడంతో కేఎంసీ అధికారుల్లో ఆందోళన నెలకొన్నట్లు సమాచారం. కాగా, గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ఇతర మున్సిపాలిటీలకు బదిలీపై వెళ్లగా వారికి సైతం నోటీసులు వెళ్తాయని చర్చ జరుగుతోంది.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ1
1/2

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ2
2/2

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement