
ఖమ్మం: ప్రేమ ఖండాంతరాలు దాటింది.. అమెరికా అబ్బాయితో సత్తుపల్లి అమ్మా యికి శనివారం రాత్రి సత్తుపల్లిలో వివాహం జరిగింది. సత్తుపల్లికి చెందిన పిల్లలమర్రి జానకీరాములు–పద్మావతి కుమార్తె రాజ్యలక్ష్మి యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
ఆమె పనిచేసే సంస్థలో సహోద్యగి, మైకేల్ మిల్లర్, మిచెల్‌హిల్ కుమారుడు మ్యాథ్యూతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మా రింది. దీంతో ఇరువైపుల పెద్దలు అంగీకరించటంతో శనివారం రాత్రి సత్తుపల్లిలోని శ్రీలక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాల్‌లో వివాహం చేసుకున్నారు.