శివమొగ్గ: గత నాలుగైదు రోజులుగా మల్నాడు, బెళగావి ప్రాంతాల్లో కురుస్తున్న జోరువానలు తగ్గిపోయాయి. శివమొగ్గ జిల్లాలో లింగనమక్కి, తుంగ, భద్ర వంటి ప్రధాన జలాశయాలలోకి నీటి ప్రవాహం తగ్గింది. గురువారం ఉదయం 8 గంటల నాటికి, లింగనమక్కి డ్యాంలోకి నీటి ప్రవాహం 36,867 క్యూసెక్కులుగా ఉంది.
డ్యాం నుంచి నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 1760 అడుగులు (గరిష్ట స్థాయి: 1819 అడుగులు) గా ఉంది. గతేడాది ఇదే రోజున డ్యామ్ నీటిమట్టం 1796 అడుగులుగా ఉంది. ఈ ఏడాది 35 అడుగుల మట్టం తక్కువగా ఉంది.
తుంగా నుంచి నీరు
తుంగ డ్యాంలోకి 38,413 క్యూసెక్కుల నీరు వస్తోంది, డ్యాం దాదాపు నిండడంతో కొంత నీటిని వదులుతున్నారు. ఆ నీరు భద్రా నది ద్వారా హొస్పేటలోని తుంగభద్ర రిజర్వాయర్‌కు వెళ్తోంది. 316 క్యూసెక్కులను మాత్రమే వదిలారు.
గురువారం ఉదయం 8 గంటలకు పశ్చిమ కనుమల శ్రేణిలోని మణి లో 111 మిల్లీమీటర్లు (మి.మీ.), యడూర్‌లో 79 మి.మీ., హులికల్‌లో 93 మి.మీ., మాస్తికట్టేలో 126 మి.మీ., చక్రలో 123 మి.మీ. మరియు సేవెహుక్లులో 108 మి.మీ. వర్షపాతం నమోదైంది.
అరేబియా అలల జోరు
బెళగావి జిల్లాలోనూ వానలు తగ్గాయి. అయితే గత కొన్నిరోజులుగా పడిన వానలతో చిన్నా పెద్దా నదులు జలకళ సంతరించుకున్నాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న నీటిలో బాగల్‌కోట జిల్లోలో ఘటప్రభ నదిలో ప్రవాహం పెరిగింది. మరోవైపు తీరప్రాంతం మంగళూరులో అరేబియా సముద్రం ఊపు మీద ఉంది. ఉవ్వెత్తున అలలు దూసుకొస్తూ తీరానికి ఆనుకుని ఉన్న ఇళ్లకు ముప్పుగా మారాయి. బెంగళూరు సహా ఇతర జిల్లాల్లో వానల జాడ లేకుండా పోయింది.
మల్నాడు, బెళగావిలో తగ్గిన వానలు


