యశవంతపుర: ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారిగా ఆయన తిరుమలకు వెళ్లారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రివర్గ విస్తరణ తరువాత డీకే శివకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. గురువారం జరిగిన విధాన పరిషత్ ఎన్నికల్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ బలం పెరిగిన సంతోషంలో కుటుంబంతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ ఫొటోలను సీఎం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అది మా పార్టీ అంతర్గతం
● ఎవరికీ మాట్లాడే అధికారం లేదు
● బీజేపీ నేత ఆర్.అశోక్ మండిపాటు
శివాజీనగర: రాజ్యసభ టికెట్ విషయంపై మాట్లాడిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్.డీ.రేవణ్ణ, మండ్య మేడంకు కూడా టోపీ వేశారు. ఆమైకె నా టికెట్ ఇచ్చి ఉంటే తామేం వద్దు అనేవారమా? అని తెలిపారు. ఇదే విషయమై రేవణ్ణ వ్యాఖ్యలపై స్పందించిన విపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవణ్ణ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ చర్చకు దారి తీస్తాయన్న అశోక్, అది తమ పార్టీ అంతర్గత విషయం. రేవణ్ణకు కాని, మరొకరికి కాని మాట్లాడే అధికారం లేదు. ఎవరికీ కూడా ఈ విషయంపై మాట్లాడేందుకు హక్కు లేదని విరుచుకుపడ్డారు. బీజేపీ ఎవరికీ రాజ్యసభ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వలేదు. పార్టీ నియమాల ప్రకారం తాము తమ నిజాయితీ కలిగిన కార్యకర్తలకు మాత్రమే రాజ్యసభ టికెట్ ఇచ్చాం. ఈ నిర్ణయం పూర్తిగా తమ పార్టీ అంతర్గత విషయాల్లో భాగమన్నారు. కాగా రాజ్యసభ స్థానానికి ముందుగా దేవెగౌడ, సదానందగౌడల పేర్లు వినిపించాయి. ఆ తరువాత మధ్యలో మేడం సుమలత పేరు వినిపించింది. మండ్య మేడంకు కూడా వారు టోపీ వేశారు. ఆమెకు ఇచ్చినా తామేం వద్దనేవారమా ? అని రేవణ్ణ తెలిపారు.
మేకెదాటుకు తమిళనాడు నో
యశవంతపుర: మేకెదాటు పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. శుక్రవారం జరిగిన శాసనసభలో సీఎం జోసెఫ్ సీ.విజయ్ పథకాన్ని ప్రస్తావించి మేకెదాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. మేకెదాటు పథకానికి సాంకేతిక, పర్యావరణ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేవని శాసనసభలో చర్చించి పథకానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు సభలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
తల్వార్‌తో కేక్ కటింగ్
యశవంతపుర: చిక్కమగళూరు పట్టణంలోని వాజపేయి లేఔట్‌లో యువకులు నడిరోడ్డుపై తల్వార్‌తో పుట్టిన రోజు కేక్ కట్ చేయటం వివాదంగా మారింది. మహమ్మద్ సమీర్ అనే యువకుడు గురువారం రాత్రి లాంగ్ పట్టుకొని కేక్‌ను కత్తరించారు. ఐదు కేజీల కేక్‌ను లాంగ్‌తో కత్తిరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఘటనపై చిక్కమగళూరు గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


