బనశంకరి: సీఎం నేతృత్వంలో శుక్రవారం విధానసౌధలో గృహలక్ష్మి పథకంపై ప్రగతి పరిశీలన సమావేశం నిర్వహించారు. అర్హులకు పథకాలు అందించడంలో ఇబ్బంది కలగరాదని, అనర్హులు, పథకం దుర్వినియోగానికి మాత్రమే అడ్డుకట్ట వేయాలని అధికారులకు ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ సూచించారు. అనేక మంది అర్హులు బ్యాంక్ రుణం తీసుకున్నారని, రుణం అకౌంట్‌కు గృహలక్ష్మిద డబ్బు జమ కాగానే రుణం మొత్తానికి జమ అవుతోంది. దీంతో అలాంటి అర్హులు అకౌంట్ మార్చాలని, ఇలాంటి అర్హులకు ఎలాంటి ఇబ్బంది కలగరాదని తెలిపారు. గృహజ్యోతి గ్యారంటీ పథకం అమల్లోకి వచ్చినప్పుడు దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇదే విధంగా మిగిలిన పథకాల్లో కూడా వ్యవహరిస్తే దుర్వినియోగం తగ్గుతుందన్నారు.
మృతుల అకౌంట్లకు నగదు జమ
మరణించిన వారి అకౌంట్లకు గృహలక్ష్మిద పథకం నగదు జమ అవుతున్నట్లు వెలుగుచూసింది. ఇలా దుర్వినియోగం కారాదన్నారు. గృహలక్ష్మి నగదు అర్హుల అకౌంట్లకు జమ కాగానే వారి మొబైల్‌కు వాయ్స్ మెసేజ్ ద్వారా ధృవీకరణ కావాలని తెలిపారు. బ్యాంకు అకౌంట్లు కర్ణాటకలో మాత్రమే ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో బ్యాంకు అకౌంట్లకు నగదు జమ అవుతున్నట్లు తెలిసిందని, దీనిని నిలిపివేయాలన్నారు. తమ రాష్ట్ర పథకాలు మన రాష్ట్ర అర్హులకు మాత్రమే అందాలి. ఇతర రాష్ట్రాల ఓటర్లకు అందుతున్న పథకాలకు చెక్‌పెట్టాలి. మృతి చెందిన వారి సంఖ్య సకాలంలో లభించక పోవడం, ఈ–కేవైసీ, బ్యాంక్ అకౌంట్, ఎన్‌పీసీఐ అర్హుల గురించి సమావేశంలో చర్చించారు. ఒకే అకౌంట్‌లో అనేక మంది అర్హులు గృహలక్ష్మి సొమ్ము పొందుతున్నారన్నారు. మూడు లక్షల ఖాతాల్లోకి మొత్తం రూ.60 కోట్ల నగదు వెళ్లిందని ఏజీ నివేదికలో తెలిసింది.
దుర్వినియోగానికి మాత్రమే చెక్ పెట్టాలి
గ్యారంటీ పథకాలపై
ప్రగతి పరిశీలనలో సీఎం


