పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు | - | Sakshi
Sakshi News home page

పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు

Jun 20 2026 11:19 AM | Updated on Jun 20 2026 11:19 AM

దొడ్డబళ్లాపురం/కోలారు/హుబ్లీ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. చిత్రదుర్గ, బాగల్‌కోట, దావణగెరె, ధారవాడ, కోలారు జిల్లా కోర్టులకు శుక్రవారం ఉదయం గుర్తు తెలియని ఐడీ నుంచి నేరుగా జడ్జీలకు ఈమెయిల్‌లు పంపించారు. అప్రమత్తమైన అధికారులు న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బందిని బయటకు పంపించారు. పోలీసులు ఆయా స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. ఎటువంటి బాంబులు లభించలేదు. ఈ ఈమెయిల్స్‌ కేరళ వయనాడ్‌ నుండి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కోలారు జిల్లా వచ్చిన మెయిల్‌ను పరిశీలించగా అందులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా జై కనిమోళి అని రాసి ఉన్నట్లు గుర్తించారు. ధార్వాడ జిల్లా కోర్టుకు వచ్చిన ఇ–మెయిల్‌లో ‘నిన్న మధ్యాహ్నం 2 గంటలకు 23 సైనేడ్‌ వాయు తుటాలు పేలాయి, అది ట్రయల్‌ మాత్రమే, ఈ రోజు జరిగేది నిజం’ అంటూ సందేశాన్ని పంపారు.

బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్లతో తనిఖీలు

లభించని పేలుడు ఆనవాళ్లు

ఉత్తుత్తి బెదిరింపులుగా నిర్ధారణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement