రాయచూరు రూరల్: దేవదుర్గలో మౌలిక సౌలభ్యాల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని జిల్లా అధికారి పూవిత సూచించారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం నగర సభ కార్యాలయంలో జరిగిన సభలో అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. తాగునీటి జలాశయం, వివిధ ప్రాంతాల్లోని మురికి కాలువల్లో పూడిక, చెత్తా చెదారాన్ని తొలగించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాస్పత్రి, ఇందిరా క్యాంటీన్లను సందర్శించారు. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఎరువులు, క్రిమి సంహరక మందుల దుకాణాలను తనిఖీ చేశారు. రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తాలూకా విద్యాశాఖ అధికారి రాధా దేవి, సీడీపీఓ మహేష్ నాయక్ పాల్గొన్నారు.


