రాయచూరు రూరల్: ఓటరు జాబితా సవరణకు చర్యలు చేపట్టాలని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి పేర్కొన్నారు. గురువారం ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితాలో ఓటు హక్కు పరిరక్షణలో అర్హులైన ఎవరి ఓటు కూడా తొలగించకుండా చూసుకోవాలన్నారు. అధికార పార్టీలు అక్రమాలకు పాల్పడితే సమష్టిగా అడ్డుకోవాలన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత కనబడుతోందన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఓటర్ల పేర్ల తొలగింపు వివాదాస్పదమైన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో శివశంకర్, నరసింహ నాయక్, లక్ష్మిపతి, అమరేష్ పాటిల్, నరసప్ప, జంబునాథ్, తిమ్మారెడ్డి, గోవిందరెడ్డి, విజయ కుమార్, యల్లారెడ్డి, రఫీలున్నారు.


