జాడ లేని వర్షాలు.. ఆందోళనలో రైతులు | - | Sakshi
Sakshi News home page

జాడ లేని వర్షాలు.. ఆందోళనలో రైతులు

Jun 19 2026 12:36 AM | Updated on Jun 19 2026 12:36 AM

హొసపేటె: ప్రస్తుత వర్షాకాలంలో, రోహిణి వర్షాలకు నేల తడిసి పోవడంతో రైతులు పత్తి, అలసంద, జొన్న వంటి వర్షాకాలపు పంటలను విత్తారు. కానీ ఇప్పుడు గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా తాము నాటిన విత్తనాలు ఎక్కడ ఎండిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికార వర్గాల సమాచారం ప్రకారం గతేడాది అంటే 2025 జూన్‌ నెలలో 133.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ప్రస్తుత 2026లో కేవలం 52.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే 81.7 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు ఉంది. దీంతో నీటిపారుదల సౌకర్యం ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా వేసిన పంటలను కాపాడుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల పాటు వర్షాలు కురవకపోతే రుతుపవనాల ప్రభావం మొక్కజొన్న, పత్తి పంటలపై పడుతుంది.

పాఠశాల రెండో అంతస్తు

నుంచి పడి విద్యార్థి మృతి

హుబ్లీ: పాఠశాల రెండో అంతస్తు నుంచి అదుపు తప్పి పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లాలోని నవలగుంద పట్టణంలో జరిగింది. మృతి చెందిన బాలుడిని అక్కడి అణ్ణిగేరి రోడ్డులోని విద్యాజ్యోతి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఆకాశ్‌ నీలన్నవర్‌ (10)గా గుర్తించారు. ఈ బాలుడు 4వ తరగతి చదువుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని హుబ్లీ కిమ్స్‌కు తరలించారు. ఘటన స్థలాన్ని నవలగుంద పోలీసులు పరిశీలించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement