మైసూరు: ఇంటి కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలకు జొరబడిన దొంగలు రూ.24 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దోచుకుని పరారైన ఘటన మైసూరులోని దట్టగళ్లి నివాసి కోమల అనే వారి ఇంటిలో జరిగింది. కోమల రెండు నెలల క్రితం ఇంటికి తాళం వేసుకుని బెంగళూరులోని తన కుమార్తె ఇంటికి వెళ్లారు. మంగళవారం ఇంటికి వాపసు వచ్చి చూడగా కిటికీ అద్దం పగులగొట్టి ఉంది, అల్మారాలో పెట్టిన వజ్రం, ముత్యాల చైన్, బంగారు, వెండి ఆభరణాలు లేవు. కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది.


