ఆభరణాలు స్వాధీనం .. నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆభరణాలు స్వాధీనం .. నిందితుడి అరెస్ట్‌

Jun 18 2026 12:53 AM | Updated on Jun 18 2026 12:53 AM

రాయచూరు రూరల్‌ : నగరంలోని నేతాజీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీకి గురైన 40 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేశామని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. మంగళవారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ఏప్రిల్‌లో ప్రశాంత్‌ కాలనీకి చెందిన వీరేష్‌ ఇంట్లో 25 గ్రాములు, శ్రీరామనగర్‌ కాలనీలో 15 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారని తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన దొమ్మర గోవిందరాజును అరెస్ట్‌ చేసి అతని వద్ద ఉన్న 40 గ్రాముల బంగారు నగలు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.7.20 లక్షలుంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏడీఎస్పీ హరీష్‌, సీఐ ఉమేష్‌ కాంబ్లే, ఎస్‌ఐ మంజునాథ్‌, శారదలున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement