రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు భూమి, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం డిమాండ్ చేసింది. అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు వీరేష్ మాట్లాడారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు కేటాయించి, భూమి లేని పేదలకు పట్టాల పంపిణీతోపాటు భూములు కేటాయించాలన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతూ అదనపు జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.


