● నలుగురికి గాయాలు
యశవంతపుర: ధర్మస్థలలో అస్థిపంజరాల కేసును విచారిస్తున్న సిట్ ఎస్పీ ప్రయాణిస్తున్న కారు చార్మాడి ఘాట్‌లో ప్రమాదానికి గురైంది. ఎస్పీ సైమన్, సీఐ కుసుమధర్, డ్రైవర్, మరో కానిస్టేబుల్‌లు ఇన్నోవాలో వెళ్తున్నారు. చిక్కమగళూరు ఎస్పీ, సిట్ అధికారైన జితేంద్రకుమార్ దయామ ను కలవడానికి వెళుతుండగా బెళ్తంగడి మార్గంలో కారు పల్టీలు కొట్టి నుజ్జయింది. ఎస్పీ సహా నలుగురూ స్వల్ప గాయాల పాలయ్యారు. స్థానికులు వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఎస్పీ సైమన్ బెళ్తంగడి ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


