బనశంకరి: సీఎం డీకే శివకుమార్‌తో బెంగళూరులోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భేటీ అయ్యారు. మంగళవారం విధానసౌధలో ఈ సమావేశం జరిగింది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ బెంగళూరును విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి మద్దతుగా ఉంటామని తెలిపారు. సీఎంతో సమావేశం సంతోషకరమన్నారు. బెంగళూరు నగర ప్రజలకు అవసరమైన సౌలభ్యాల గురించి చర్చించామన్నారు. సొరంగ మార్గాలు, ఫ్లై ఓవర్లు, రహదారులు, కారిడార్లు, పెరిఫెరల్ రింగ్‌రోడ్లు వంటి పథకాలు ఇందులో ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో సురేశ్, గీతాంజలి కిర్లోస్కర్, విక్రం విశ్వనాథ్, మోహన్ సురేశ్ తదితరులు ఉన్నారు.


