రక్తదానంపై జాగృతి జాతా | - | Sakshi
Sakshi News home page

రక్తదానంపై జాగృతి జాతా

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలో రక్తదానంపై ప్రజల్లో జాగృతి పెంపొందించాలని రిమ్స్‌ అధికారి రమేష్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆరోగ్యాధికారి కార్యాలయం వద్ద జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా పంచాయతీ, రాష్ట్ర ఎయిడ్స్‌ సంస్థ, ఆరోగ్య శాఖ, రిమ్స్‌, నవోదయ, రక్త నిధి కేంద్రాలు, లయన్స్‌ క్లబ్‌, ఏఎం దంత కళాశాల, రెడ్‌ క్రాస్‌, రోటరీ సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాల జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు వివరించాలన్నారు. ఇంటింటికెళ్లి అత్యవసర సమయంలో యువకులు రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రక్తదానం చేయాలని సూచించారు. జాతాలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, జిల్లా ఆరోగ్య శాఖాధికారి సురేంద్ర బాబు, వైద్యులు గణేష్‌, శాకీర్‌, నందిత, బసయ్య, సంధ్య, సరోజలున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement