రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

Jun 17 2026 5:03 AM | Updated on Jun 17 2026 5:03 AM

కణేకల్లు: మండలంలోని ఆలూరు గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు గాయపడ్డారు. వివరాల్లోకెళితే... హైదరాబాద్‌లో నివాసముంటున్న భార్యాభర్తలు శోభ (43), తిప్పేస్వామి (48) వచ్చే నెలలో జరుగనున్న తమ కూతురు చందన పెళ్లికి బంధువులను ఆహ్వానించేందుకు సోమవారం బళ్లారికొచ్చారు. బళ్లారిలో పెళ్లిపత్రికలు పంచాక మంగళవారం కారులో మాల్యం గ్రామానికొచ్చారు. కణేకల్లు, మాల్యంలలో పెళ్లి పత్రికలు పంచి కారులో బళ్లారికి తిరుగు ప్రయాణమవుతూ ఆలూరు వద్ద పైప్‌లైన్‌ పనులు చేస్తున్న హైడ్రాలిక్‌ క్రేన్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు శోభ, తిప్పేస్వామిలకు గాయాలయ్యాయి. శోభకు కాలు, చేయి ఫ్రాక్చరైంది. తిప్పేస్వామి స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు 108 సాయంతో వారిని కణేకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స చేసిన అనంతరం వారిని అనంతపురం ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement