రాయచూరు రూరల్: గాలి, వెలుతురు లేకుండా అన్న పానీయాలు లేకుండా లోక కళ్యాణార్థం 33 రోజులు ఉపవాస దీక్షలు చేపట్టిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. విజయపుర జిల్లా సింధగి తాలూకా అంతూర బెంతూరలో ఓ స్వామీజీ 33 రోజుల క్రితం మౌనదీక్షలు చేపట్టారు. రాచోటేశ్వర స్వామీజీ 33 రోజుల పాటు తాను కూర్చొన్న స్థలంలో ఇటుకలతో వాకిళ్లని మూసివేసి సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసి దానిపై ఆవు పేడతో అలికి ముగ్గులు, రంగులు వేయించారు. సోమవారం సాయంత్రం మౌన దీక్షకు తెరదించారు. గుహలో ఉన్న స్వామీజీని భక్తులు గుహను తొలగించి చూడగా స్వామీజీ మౌన దీక్షలో ఉండడం విజ్ఞానానికి సవాల్‌గా మారింది. ఈనేపథ్యంలో కుతూహలంతో స్వామీజీని చూడడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.


