రాయచూరు రూరల్: కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి మండలి(కేఐఏడీబీ) ఆధ్వర్యంలో యరమరస్ వద్ద 2013–14లో నిర్మించిన ఇళ్లు నేడు వికారంగా మారాయి. దశాబ్దం క్రితం 253 ఎకరాల్లో రూ.150 కోట్లతో 3,342 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన కేఐఏడీబీ అధికారులు వాటి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో నేడు ఆ నివాసాలు పాడుబడిన ఇళ్లుగా మారాయి. 255 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా కేవలం 60 మందికి మాత్ర మే ఇళ్లు పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. వాటి నిర్వహణలో బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. 3,087 ప్లాట్లు ఖాళీ స్థలాలుగా మిగిలాయి. 255 ఇళ్లలో 60 ఇళ్లను పంచగా, మిగిలిన 195 ఇళ్లు భూత్ బంగ్లాలుగా మారాయి. ఎక్కడ చూసినా ముళ్ల కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగాయి. అధికారుల నిరక్ష్యంతో వేలాది ఇళ్ల స్థలాలు ఖాళీగానే మిగిలి పోయాయి. ఇళ్లు లేని, మధ్య తరగతి వర్గాలకు, బీపీఎల్ కార్డుదారులకు 50 ఽఽశాతం రాయితీతో స్థలాలు కేటాయించి అప్పగించడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
కేఐఏడీబీ అధికారుల దివ్య నిర్లక్ష్యం
రూ.150 కోట్ల నిధులు బూడిద పాలు
నాడు 253 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం


