ఇంటర్‌ ఫలితాల్లో కొత్త చరిత్ర | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో కొత్త చరిత్ర

Apr 10 2026 10:51 AM | Updated on Apr 10 2026 10:51 AM

బనశంకరి: కర్ణాటక ద్వితీయ పీయూసీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 5,46,698 మంది విద్యార్థులు పాస్‌ కాగా, రాష్ట్ర చరిత్రలో తొలిసారి 86.48 శాతం ఉత్తీర్ణత నమోదైంది, ఇది చారిత్రక రోజు అని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది పీయూసీ ఫలితాలు గతేడాది కంటే 13 శాతం పెరిగాయని చెప్పారు. గురువారం బెంగళూరులో ఆయన మీడియా సమావేశంలో ఇంటర్‌ ఫలితాలను ప్రకటించారు.

6.32 లక్షల మందిలో 5.46 లక్షలు పాస్‌

● 6,32,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,46,698 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,32,928 మంది బాలురు, 3,13,770 మంది బాలికలు. ఈసారి అమ్మాయిలే పైచేయి సాధించారు.

● ఆర్ట్స్‌ విభాగంలో 98,310 (72.86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. కామర్స్‌ విభాగంలో 1,82,317 (88.04శాతం), సైన్స్‌లో 2,66,071 (86.48 శాతం) మంది పాసయ్యారు.

● నగర ప్రాంతంలో 3,71,853 (85.95 శాతం), గ్రామీణ ప్రాంతంలో 1,74,845(87.62 శాతం) మంది పాసయ్యారు.

● డిస్టింక్షన్‌లో 1,70,529 మంది, ప్రథమ శ్రేణిలో 2,95,385 మంది, ద్వితీయశ్రేణిలో 63,957 మంది ఉత్తీర్ణత సాధించారు. 16,827 మంది జస్ట్‌ పాస్‌ అనిపించుకున్నారు.

ఫలితాల్లో పురోగతి: మంత్రి

వెబ్‌సైట్‌లో ఫలితాలు, మార్కులు కూడా అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. గత ఏడాది కళ్యాణ కర్ణాటకలో 61 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈసారి 79 శాతానికి పెరిగారని తెలిపారు. ప్రభుత్వ కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు ఏటేటా ప్రగతి సాధిస్తున్నారని చెప్పారు. ఫలితాల్లో గతేడాది మాదిరిగానే ఈసారీ 96.39 శాతంతో ఉడుపి ప్రథమ స్థానం పొందితే, యాదగిరి జిల్లాది చివరి స్థానం. బెంగళూరు 5 ప్లేసులో నిలిచింది.

ఇక సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 30న మొదలై మే 13 వరకు జరుగుతాయి. ఫీజు వివరాలకు పీయూసీ బోర్డు వెబ్‌సైట్‌ లేదా కాలేజీలో సంప్రదించాలని తెలిపారు.

రాష్ట్రంలో తొలిసారి 86 శాతం ఉత్తీర్ణత

5.46 లక్షల మంది పాస్‌

బాలికలదే పైచేయి

ఉడుపి జిల్లా ప్రథమం, యాదగిరికి

చివరి స్థానం

ఏ జిల్లా.. ఎంత ఉత్తీర్ణత

ఉడుపి 96.39 శాతం ఉత్తర కన్నడ 96.35

కొడగు 92.34 విజయపుర 92

బెంగళూరు గ్రామాంతర 91 చిక్కమగళూరు 90.80

బెంగళూరుదక్షిణ 90.55 చిక్కబళ్లాపుర 90.24

బెంగళూరు ఉత్తర 90.05 హాసన్‌ 89.71

మండ్య 88.85 రామనగర 87.90

కోలారు 87.38 శివమొగ్గ 87.62

తుమకూరు 86.89 కొప్పళ 86.80

చామరాజనగర 84.68 మైసూరు 84.80

బీదర్‌ 84.61 బాగల్‌కోటే 84.12

హావేరి 84.11 ధారవాడ 83.31

చిక్కోడి 83.10 దావణగెరె 81.99

బెళగావి 80.32 చిత్రదుర్గ 79.12

బళ్లారి 78.69 కలబుర్గి 76.97

గదగ్‌ 76.65 రాయచూరు 74.09

యాదగిరి 71.21

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement